చిన్నారి బ‌ర్త్‌డే జ‌రిపిన పోలీసులు!


ప్రపంచంలో కరోనావైరస్ వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించారు. ఈ స‌మ‌యంలో ఎక్క‌డివారెక్క‌డా ఆగిపోయారు. దీంతో ఎవ‌రూ బ‌ర్త్‌డేలు, మ్యారేజ్‌లు జ‌రుపుకోవ‌డం లేదు. అయినా నాలుగేండ్ల చిన్నారి త‌న పుట్టిన‌రోజు జ‌ర‌పుకున్న‌ది. అది కూడా కేక్‌, బ‌ర్త్‌డే టోపీ ధ‌రించి. ఇదంతా చేసింది పుతేపురి బేరిలోని పోలీస్ స్టేష‌న్ అధికారులు. ఈ పోలీసులు ఈ చిన్నారి పుట్టిన‌రోజు మాత్ర‌మే కాదు, ఏడాది వ‌య‌సున్న పాప బ‌ర్త్‌డే జ‌రుపుకోవ‌డానికి ఆ కుటుంబానికి కేక్ కూడా అందించారు. దీంతో ఆ కుటుంబ స‌భ్యులు చాలా సంతోషించారు. ఈ వీడియోను పంజాబ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఇలా చిన్న సంతోషాలు మిస్ అవ్వ‌కుండా ఉండేందుకు ఇలా చేసార‌ని పోలీసులు తెలిపారు.