జిల్లా అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు సీఎం నిధులు మంజూరు చేశారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. ఏ ఊరికి ఆ ఊరిలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మెదక్ జిల్లాలో 125 మందిని క్వారంటైన్‌లో ఉంచాం.
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 15 బెడ్‌లతో క్వారంటైన్ వార్డులు ఏర్పాటు చేశాం. 8 బెడ్‌లతో ఐసీయూ ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఈ రోజు సాయంత్రం నుంచే అందుబాటులోకి వస్తాయి. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాం. సామాజిక దూరం పాటించి కరోనాను తరిమి కొడతామని తెలిపారు.