డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారమయ్యే అడ్వెంచరస్ షో.. మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రేక్షకులకి ఎంతటి థ్రిల్ కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షో హోస్ట్ ఎడ్వర్డ్ మైఖేల్ గ్రిల్స్ అలియాస్ బియర్ గ్రిల్స్ సెలబ్రిటీస్‌తో చేయించే సాహసాలు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి. తాజాగా కర్నాటకలోని బందిపుర్ అడవుల్లో రజనీకాంత్‌తో షూటింగ్ జరిపారు బియర్ గ్రిల్స్. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి పలు ఫోటోలు విడుదల కాగా, తాజాగా షో టెలికాస్ట్ డేట్‌కి సంబంధించి ప్రోమో విడుదల చేశారు. మార్చి 23వ తేదీ రాత్రి 8గం.లకి షో డిస్కవరీ ఛానెల్‌లో షో ప్రసారం కానుందని పేర్కొన్నారు.
రజనీ వర్సెస్ బియర్.. ప్రీమియర్ రిలీజ్ డేట్ వచ్చేసింది